సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో పూరి సినిమా మిస్ వెన‌క ఇంత క‌థ ఉందా...?
దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు ‘బద్రి’ తొలి సినిమా. అంతకుముందు సినిమాలపై మక్కువతో హైదరాబాద్‌ వచ్చిన పూరి జగన్నాథ్‌ ఎన్నో సినీ కష్టాలు పడ్డారు. ఉత్తేజ్‌ ద్వారా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మతో పూరి జగన్నాథ్‌కు పరిచయం ఏర్ప‌డ‌డం అలా వ‌ర్మ ద‌గ్గ‌ర ఆయ‌న శిష్య‌రికం చేయ‌డం... అలా ఆయ‌న డైరెక్ట‌ర్ అవ్వ‌డం జ‌రిగాయి. వ‌ర్మ శివ సినిమాను హిందీలో రీమేక్ చేస్తోన్న టైంలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తాన‌ని అడ‌గ‌గా.. అప్ప‌టికే వ‌ర్మ ద‌గ్గ‌ర చాలా మంది అసిస్టెంట్లు ఉండ‌డంతో వ‌ర్మ పూరీకి నటుడిగా అవకాశం ఇచ్చారు. నాగార్జునతో  ఉండే రౌడీ బ్యాచ్‌లో ఒకరిగా పూరి జగన్నాథ్‌ తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 

 

ఒకవైపు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు పూరి థిల్లానా అనే క‌థ చెప్పి ఒప్పించాడు. అయితే ఈ సినిమా ముహూర్తం జ‌రుపుకున్నాక ఆగిపోయింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆర్తిక స‌మ‌స్య‌లే. ఆ త‌ర్వాత పూరి సుమ‌న్‌తో స్టార్ట్ చేసిన సినిమా కూడా షూటింగ్‌ మొదలవ్వకముందే ప్యాకప్‌ పడింది. మూడో ప్రయత్నం చేజారి పోకూడదని త్రీవంగా ప్రయత్నించి చివ‌ర‌కు ప‌వ‌న్‌తో ప్ర‌య‌త్నించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ‌ద్రితో స‌క్సెస్ అయ్యాడు.

 

అప్ప‌టికే వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో దూసుకు పోతోన్న మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూరి చెప్పిన క‌థ‌ను విని ఇంప్రెస్ అయ్యాడు. ప‌వ‌న్ ఈ క‌థ చెప్పేందుకు కేవ‌లం 20 నిమిషాల టైం ఇవ్వ‌గా పూరి క‌థ చెప్ప‌డంతో ఇంప్రెస్ అయ్యి ఏకంగా మూడు గంట‌ల టైం ఇచ్చాడు. అలా పూరి విజ‌య ప్ర‌స్థానం బ‌ద్రితో ప్రారంభ‌మై 20 ఏళ్లుగా నేటి ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ వ‌ర‌కు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ప్ర‌స్తుతం పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఫైట‌ర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: