ప్రస్తుతం మన తెలుగు టెలివిజన్ తెరపై మంచి పేరుతో దూసుకెళ్తున్న యాంకర్లలో సీనియర్ యాంకర్ అయిన ఝాన్సీ కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం సుమ కనకాల, ఉదయభాను, అనితా చౌదరి సహా దాదాపుగా అదే సమయంలో ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు ఝాన్సీ. అయితే ఆ సమయంలో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి మంచి క్రేజ్ ఉండటం, అలానే ఝాన్సీ లో కూడా రాణించాలనే మంచి కసి ఉండటంతో ఆమెకు మెల్లగా అవకాశాలు రాసాగాయట. అప్పట్లో జెమినీ టీవీలో టాక్ ఆఫ్ ది టౌన్, ఈటీవీ ఛానల్ లో సందడే సందడి, ఆపై జెమినీ లో ప్రసారమైన అమృతం, మా టివిలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, పెళ్లి పుస్తకం సహా మరికొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా వ్యవహరించిన ఝాన్సీ, మధ్యలో సినిమాల్లో కూడా నటించి నటిగా కూడా అత్యద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించారు. 

 

ముందుగా 1997లో వచ్చిన ఆహ్వానం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఝాన్సీ, ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇంకా యాంకర్ గా కూడా కొనసాగుతున్న ఝాన్సీ, కొన్నేళ్ళ క్రితం జోగి నాయుడు ని వివాహం చేసుకోవడం జరిగింది. కొన్నాళ్ళకు వాళ్ళిద్దరికీ పాప పుట్టిన తర్వాత వారి కుటుంబంలో కొంత కలతలు చెలరేగటంతో, వారు ఒకరికొకరు విడిపోవడం జరిగింది. కొన్నాళ్లుగా తన పాపతో కలిసి ఒంటరిగానే జీవిస్తున్న ఝాన్సీ, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, మొదట్లో కొంత మధన పడ్డ తాను, ఆ తర్వాత మెల్లగా వాటి నుంచి తేరుకుని, మళ్లీ తన బిజీ లైఫ్ లోకి ప్రవేశించాను అని అంటారు. 

 

మన పని మనం చేసుకుంటూ పోతే ఎటువంటి చికాకులు ఎదురుకావని, చేసే పనిమీదనే మనం దృష్టి పెట్టగలిగితే సమస్యలు ఎక్కువగా గుర్తుకు రాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఝాన్సీ తరచూ చెబుతూ ఉంటారు. ఇక ఏ వృత్తిలో నైనా పోటీ అనేది తప్పదని, కాకపోతే దానిని ఎదుర్కొని, సవాళ్లను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగితే కొంత ఆలస్యంగానైనా గెలుపు మన వద్దకు చేరుతుందని ఝాన్సీ అంటారు. ఇక అక్కడక్కడా కొన్ని సినిమా కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఝాన్సీఇటీవల బుల్లితెరపై కూడా మరింత బిజీ అయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకుల ఆధారణే అని ఝాన్సీ చెబుతుంటారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: