టాలీవుడ్ యువ నటుడు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ఈసారి ఈ ఆర్ఆర్ఆర్ తో అతి పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా హీరోగా మంచి పేరు గడించాలని చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఎక్కడ ఉంటె అక్కడ మంచి సందడితో కూడిన వాతావరణం ఉంటుందని, అందరినీ ఎంతో నవ్విస్తూ ఉండే ఎన్టీఆర్, ప్రతిఒక్కరితో ఎంతో కలుపుగోలుగా ఉంటారని చాలామంది సినిమా ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ ఎంతో సరదాగా ఉండే ఎన్టీఆర్ ని ఆయన జీవితంలో జరిగిన రెండు విషాద ఘటనలు ఎంతో విషాదంలోకి నెట్టాయి. 

 

ముందుగా ఆయన సోదరుడు నందమూరి జానకి రామ్ 2014, డిసెంబర్ 6 న ఒక ఘోర రోడ్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ ఘటనతో ఒక్కసారిగా కృంగిపోయిన ఎన్టీఆర్, కొన్నాళ్ల వరకు మనిషి కాలేకపోయారు, చిన్నప్పటినుండి తమతో కలిసి పెరిగిన సోదరుడు హఠాత్తుగా అకాల మరణం పొందడం ఆయనను ఎంతో కృంగదీసిందనే చెప్పాలి. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ  29 ఆగష్టు, 2018న తెల్లవారుఝాము సమయంలో నార్కట్ పల్లె వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. ఇక ఆ ఘటన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా మానసికంగా ఎంతో కృంగిపోవడంతో పాటు కొద్దిరోజలు బయటకు కూడా రాలేకపోయారు. 

 

చిన్నప్పటి నుండి కనీ, పెంచిన తండ్రి ఒక్కసారిగా మరణించారు అని తెలియగానే ఆ బిడ్డ పడే అవస్థ నిజంగా వర్ణనాతీతం అని, అయితే తండ్రి హరికృష్ణ మరణం తరువాత, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని చాలా రోజుల పాటు ప్రక్కనే తోడుగా నిలిచి ఆయనకు ఎంతో మానసిక స్థైర్యాన్ని అందించడం జరిగింది. కాగా ఇవి రెండు కూడా తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని విషాద ఘటనలు అని, కాబట్టి ఎవరైనా సరే వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించండి అంటూ ఆ తరువాత ఎన్టీఆర్ పలు సందర్భాలు చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: