గత కొన్నాళ్లుగా యావత్ ప్రపంచ దేశాలు అన్నిటినీ కూడా కరోనా వ్యాధి భయం ప్రజలను, ప్రభుత్వాలను ఎంతో భయకంపితులను చేస్తోంది. కాగా ఈ వ్యాధిని మరింతగా ప్రబలకుండా చేయాలని చాలా దేశాల్లో ఇప్పటికే కొన్ని వారాలుగా ఎక్కడి ప్రజలను అక్కడే ఇళ్లలో ఉండేలా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే మన దేశంలో కూడా దాదాపుగా నలభై రోజుల నుండి లాక్ డౌన్ అమలవుతోంది. దీనితో దేశంలోని రంగాలు అన్ని కూడా మూతబడడంతో పాటు సినిమా పరిశ్రమ కూడా అన్ని షూటింగ్స్ ని బంద్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఈ లాక్ డౌన్ మరొక రెండువారాలు ఉంటుంది అని అంటున్న వారు, అలానే అది మరింతగా పొడిగించినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్న వారు కూడా లేకపోలేదు. 

 

ఇక సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ వంటి బడా సినిమాలకు ఇది కొంత సమస్యగా పరిణమించినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీటిలో కెజిఎఫ్ 2 ని అక్టోబర్ 23న, అలానే ఆర్ఆర్ఆర్ ని జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఆయా సినిమాల నిర్మాతలు అధికారిక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ లాక్ డౌన్ కారణంగా రెండు సినిమాలకు తెచ్చిన ఫైనాన్స్ పై భారీగా వడ్డీ పడుతోందని, అది మాత్రమే కాక చాలా మంది ఆర్టిస్టుల కాల్షీట్స్ విషయమై పెద్ద సమస్య తలెత్తేలా ఉందని అంటున్నారు. దీనిని బట్టి రెండు సినిమాలు మరికొన్ని రోజుల పాటు వాయిదా పడినా పడొచ్చని అంటున్నారు. 

 

అయితే ఈ రెండు సినిమాలలో ఏది పెద్ద సక్సెస్ సాధిస్తుంది, ఏది బాహుబలి 2 రికార్డ్స్ ని దాటేస్తుంది, ఎవరికి ఎంత దమ్ము ఉంది అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా పలు పోల్స్ నిర్వహిస్తుండడంతో, కొందరు అటువంటి వారిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, అలానే సినిమాల షూటింగ్స్ పర్మిషన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడాలంటే, సినిమా హాల్స్, మల్టిప్లెక్స్ ల వంటివి ఎన్నాళ్లకు తెరుస్తారో కూడా తెలియడం లేదని, ఈ విధంగా సినిమా వారందరూ కూడా ఎంతో సతమతం అవుతుంటే, ఇంకా ఆ సినిమాల షూటింగ్స్ పూర్తి కాకుండానే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇప్పటినుండే వీటి గురించి డిస్కషన్స్ చేసుకుని వాదించుకోవడం సరైనది కాదని కామెంట్స్ చేస్తున్నారు....!!

 

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: