కరోనా మహమ్మారి కారణంగా  దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే సినిమా రంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకపక్క  సినిమా షూటింగులు, సినిమా రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదర్కొంటున్నారు. ఇండస్ట్రీ మూత పడడంతో సినిమాల కోసం ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకున్న కొందరు చిన్న నిర్మాతలు వడ్డీలు భరించలేక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే శరణ్యమని భావిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చిన్న సినిమాల నిర్మాతలు ఇక తప్పని సరి పరిస్థితుల్లో తమ సినిమాలను డిజిటిల్ గానే విడుదల చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. అలా కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలు ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి.

 

ఈ లాక్ డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ ఉన్న సినిమాలకు అధిక మొత్తం చెల్లించడానికి కూడా భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'పొన్మగల్ వంధాల్' అనే సినిమా డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో సూర్యసినిమా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు.ఇలా డిజిటల్ లో సినిమాలు విడుదల చేస్తే థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సంఖ్య తగ్గిపోతుంది అని థియేటర్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే సూర్య మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. 

 

ఇంకా  అమెజాన్ ప్రైమ్ తో కూడా ఒక ఒప్పందం కూడా సూర్య కుదుర్చు కున్నారట.అయితే సూర్య బాటలోనే  మరికొంత మంది చిన్న నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపడంతో సూర్యపై థియేటర్ల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్ లలో విడుదల చేయబోమని తీర్మానించేసారు. ఇక తాజాగా కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్యకు షాక్ ఇచ్చింది. తాము కూడా సూర్య నిర్మించే.. నటించే చిత్రాలను విడుదల చేయబోమని వెల్లడించింది. దీంతో సూర్య పరిస్థితి బావిలో పడ్డ ఎలుక లా మారింది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: