అక్కినేని నాగ చైతన్య హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 100% లవ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. లెక్కల మాష్టారు ఇన్ఫాచుయేషన్ అంటూ యువతకు కొత్త అలవాటు చేశాడు. ఆర్య నుండి తన సినిమాల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకునే సుకుమార్ చైతు, తమన్నాల 100% లవ్ సినిమాలో రొమాన్స్ లో పీక్స్  అనిపించాడు. 

 

టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఈగోలతో సాగే కథనం బాగుటుంది. అదే ప్రేక్షకులకు నచ్చి సినిమాకు 100 మార్కులు వేశారు. తను చెప్పే ఎలాంటి కథ అయినా ప్రేక్షకులను మెప్పించడంలో సుకుమార్ స్టైల్ వేరేలా ఉంటుంది. అది ఈ సినిమాలో కూడా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో చైతు, తమన్నాల జోడీ బాగా ఎట్రాక్ట్ చేసింది. చైతూకి ఈ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ వచ్చింది. 

 

చైతు, తమన్నాలు ఈ సినిమాలో నటించి హిట్ కొట్టడంతో మళ్ళీ ఈ జోడీ తడాఖాలో రిపీట్ చేశారు. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అయినా సినిమా రీమేక్ గా వచ్చిన తడాఖా సినిమాలో తమన్నాతో చైతన్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. మంచి ఫామ్ లో ఉన్న తమన్నా ఎలాంటి అడ్డు అదుపులేని అందాల ప్రదర్శన చేసింది. సో ఓ విధంగా చైతన్యకు తమన్నాతో రొమాన్స్ బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. కచ్చితంగా నాగ చైతన్య, తమన్నాలు కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్నారు ప్రేక్షకులు.  అయితే ఈ కాంబో మళ్ళీ ఏ డైరక్టర్ సెట్ చేస్తాడో చూడాలి. నాగ చైతన్య ఇప్పుడు వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తప్పకుండా తమన్నాతో రొమాన్స్ రిపీట్ చేస్తే మాత్రం సక్సెస్ కొట్టినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: