జూనియర్ ఎన్టీఆర్ హీరో గా మెహెర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కంత్రి. ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో ప్రధానంగా కామెడి ని ఆధారంగా చేసుకుని చేసారు అని అందుకే సినిమా ఆ రేంజ్ లో ఫ్లాప్ అయింది.ఈ సినిమా కోసం ఎన్ఠీఆర్ బరువును కూడా తగ్గించుకొని నాజూకుగా తయారయ్యాడు.అయిన సినిమా ప్లాప్ టాక్ ను అందుకుంది.కథ ఉండి ఉంటే సినిమా హిట్ అయి ఉండేది అని కాని సినిమాలో అసలు ఏ విధంగా చూసినా సరే కథ లేదు అని కేవలం పంచ్ డైలాగుల కోసం, బరువు తగ్గాడు అని చూపించడం కోసం ఎన్టీఆర్ ఈ సినిమాను చేసాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. 

 

 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన  మేనరిజం గాని, ఫైట్స్ గాని సినిమా మొత్తంలో ఎన్టీఆర్  నటన గాని అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చాయి అని చెప్పాలి.ఎన్టీఆర్ నటన జనాలకు పెద్ద స్క్రీన్ మీద అంతగా నచ్చలేదు గాని చిన్న స్క్రీన్ మీద మాత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్, హన్సికల మధ్య సాగే లవ్ సీన్స్ వల్ల సినిమాను బుల్లి తెరపై ప్రేక్షకులు హిట్ అయ్యేలా చేసారని తెలుస్తుంది.

 

 

 

సినిమా హిట్ అవడానికి డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అని అందుకే సినిమా ఫ్లాప్ అయింది అని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ సినిమా విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది అని జనాలు అంటున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా భయపడ్డారు.కొంత గ్యాప్ తో మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు.. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: