స్టార్ హీరోల  సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ కొన్ని సార్లు ఎక్కడో తేడా కొడుతుంది దీంతో ఆ సినిమాలు కాస్తా బాక్సాఫీస్ వద్ద సత్తా చూడలేక పోతుంటాయి. స్టోరీ పరంగా కామెడీ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో  ప్రేక్షకులను మెప్పించలేక పోతాయి కొన్ని సినిమాలు.ఇలాంటి సినిమాలలో ఒకటి బంగారం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు పెంచేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. 

 


 అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులందరినీ నిరాశ పరిచినప్పటికీ... బుల్లి తెరపై మాత్రం ఎంతగానో క్రేజ్ సంపాదించింది ఈ సినిమా. అయితే బుల్లితెరపై ఎక్కువసార్లు వచ్చిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా కూడా మంచి రేటింగ్ సంపాదించుకుంటోంది. ఎందుకంటే ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనదైన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. దీంతో ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

 


 ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది సినిమా స్టోరీ. తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది... అందుకే ఈ సినిమా ఎన్ని సార్లు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా చూడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. వెండితెరపై అంతగా అలరించలేకపోయిన ఈ సినిమా..  బుల్లి తెరపై మాత్రం నిజంగా బంగారం అనిపించుకుని సత్తా చాటింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: