టాలీవుడ్ లో మొదటి సినిమా తోనే తన మార్క్ ఎంటో చూపించింది తమన్నా... పాప సినిమాలకు మంచి ఫాలోయింగ్ అనేది చాలా తక్కువ కాలంలోనే వచ్చింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడం తో పాటుగా అగ్ర హీరోల సినిమాల్లో ఆమె నటన తో పాటుగా డాన్స్ కి కూడా చాలా మంచి ప్రాధాన్యత ఇవ్వడం తో స్టార్ హీరోలు ఆమె తో సినిమాలు చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఇక ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటం తో ఆ ఫాలోయింగ్ ని కూడా వాడుకున్నారు స్టార్ హీరోలు. అయితే ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి అనే చెప్పాలి. 

 

ఎక్కువగా అగ్ర హీరోల సినిమాలు ఫ్లాప్ కావడం తో ఆమెను కొన్నాళ్ళు పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసం చాలానే ఎదురు చూస్తుంది గాని ఆమెకు మాత్రం ఆవకాశాలు రావడం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక బోల్డ్ సినిమాలో నటిస్తుంది అనే టాక్ వినపడుతుంది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రాధాన్యత ఉండటం తో ఆమె ఆ సినిమాలో చేయడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సమాచారం. 

 

ఒక సీనియర్ రచయితసినిమా దర్శకత్వం వహించే అవకాశం ఉంది అని సమాచారం. మరి ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆమె పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఐటెం సాంగ్స్ తో ఇటీవలి కాలంలో ఆమె అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: