కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా ఎమ్మెస్ ఆనందన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా చక్ర. కంటికి కనిపించని వైరస్ ఎంత ప్రమాదకరమో.. వైర్ లెస్ నెట్ వర్క్ కూడా అంతే ప్రమాదకరమని విలన్ వాయిస్ ద్వారా ట్రైలర్ తో సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది చెప్పాడు డైరక్టర్ ఆనందన్. ఇక ఆగష్టు 15న అందరు నేషనాలిటీలో బిజీగా ఉంటే హ్యాకర్స్ తమ చాక చక్యంతో బ్యాంకులను లూటీ చేస్తారు. ఈ స్కాం వెనుక ఉంది ఎవరు. దీన్ని అరికట్టేందుకు ఓ మిలటరీ అధికారి ఏం చేశాడు అన్నది సినిమా కథ. విశాల్ చక్ర కేవలం తమిళంలోనే కాదు తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో రాబోతుంది.

 

రిలీజైన ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్ అనిపించకమానదు. ప్రతి ఫ్రేం.. ప్రతి సీన్.. ప్రతి డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాదు సినిమాలో విశాల్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లాంటివని చెప్పొచ్చు. విశాల్ చక్ర ట్రైలర్ తోనే బీభత్సం సృష్టించాడు. తెలుగులో ఈమధ్యలో ఈ రేంజ్ మాస్ అటెంప్ట్ చేయలేదని చెప్పాలి. అంతేకాదు సబ్జెక్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందే అవకాశం ఉంటుంది.

 

తను తమిళంలో ఏ సినిమా చేసినా సరే తెలుగులో రిలీజ్ చేస్తున్న విశాల్ చక్రతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ ఫాం లో ఉన్న విశాల్ తెలుగులో కూడా మరో హిట్ తన ఖాతాఓ వేసుకునేలా ఉన్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన అభిమన్యుడు సినిమాకు చక్రకు దగ్గర పోలికలు కనిపిస్తున్నా చక్ర హ్యాకింగ్ ద్వారా సిస్టెం ఎలాంటి ఇబ్బందులు పడుతుందో ఈ సినిమాలో చూపించారు. తప్పకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.     

మరింత సమాచారం తెలుసుకోండి: