సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్ వేస్తే అభిమానులు చప్పట్లతో ఈలలతో థియేటర్లలో నానా భీభత్సం సృస్టిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ప్రత్యేకమైన శైలిలో డాన్సులు వేసి ప్రేక్షకులను అలరించగా... ఇప్పుడు మహేష్ బాబు అత్యద్భుతమైన స్టెప్పులు వేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ తండ్రి కొడుకు డాన్స్ నైపుణ్యానికి ఎవరు సాటిరారు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆగడు, దూకుడు వంటి సినిమాల్లో మహేష్ బాబు వేసిన డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమన్నా సరసన నారి నారి అనే పాట లో మహేష్ బాబు వేసిన డాన్స్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆగడు సినిమా జంక్షన్ లో సాంగులో శృతిహాసన్ శృంగార భరితమైన నృత్యకేళి చేస్తూ సెగ పుట్టిస్తున్న అంటే మరో వైపు మహేష్ బాబు దుమ్ము రేపే స్టెప్స్ వేసి ప్రేక్షకులను బాగా అలరించాడు.


కృష్ణ భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన గూడచారి 117 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన మహేష్ బాబు ప్యాంగ్ ప్యాంగ్ పాటలో అతడు వేసిన బ్రేక్ డాన్స్ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అతడు సినిమాలోని పిలిచినా రానంటావా పాటలో కూడా మహేష్ బాబు చాలా చక్కగా నాట్యం చేసి ప్రేక్షకులను బాగా మెప్పించాడు. రాజకుమారుడు సినిమాలోని గోదారి గట్టు పైన చిన్నారి చిలుక ఉంది పాటలో మహేష్ బాబు ప్రీతిజింతా సరసన చేసిన నృత్యం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.


బాబీ సినిమాలో ఆర్తి అగర్వాల్ సరసన హీరోగా నటించిన మహేష్ బాబు అందులోని పాటల్లో అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. లాలూ దర్వాజ పాటలు మహేష్ బాబు వేసిన స్టెప్పులకు అభిమానుల చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ అదే ఎనర్జీ తో తన 44 ఏళ్ళ వయసులో కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అత్యద్భుతంగా డ్యాన్సులు చేసి అందరి మనసులను దోచేశాడు మహేష్ బాబు. మైండ్ బ్లాక్ పాట లో మూన్ వాక్ చేస్తూ లుంగీ డాన్స్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరించాడు మహేష్ బాబు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: