ముఖ్యంగా 'ముని' సీక్వెల్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా... బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో విజయాన్ని అందుకున్న కాంచన సినిమా ని లక్ష్మీబాంబ్ పేరుతో బాలీవుడ్ లో కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి చంద్రముఖి సీక్వెల్ త్వరలో లారెన్స్ తెరకెక్కించబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర దారికి సంబంధించి ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే చంద్రముఖి 2 పై వస్తున్న వార్తలపై తాజాగా... రాఘవ లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. చంద్రముఖి 2 సీక్వెల్ లో జ్యోతిక, సిమ్రాన్, కియారా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ఓ పుకారు షికారు చేస్తోంది.
దీనిపై స్పందించిన దర్శకుడు నిర్మాత కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. జ్యోతిక సిమ్రాన్ కియరాలలో ఒకరు లీడ్ రోల్ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని... అంతా ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు, త్వరలోనే ఈ సినిమా లో ఫిమేల్ లీడ్ రోల్ ప్రకటిస్తామని తెలిపిన రాఘవ లారెన్స్... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ గురించి స్పష్టత ఇస్తామని క్లారిటీ ఇచ్చారు లారెన్స్.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి