ఎన్టీఆర్. విజయా పిక్చర్స్ కాంబినేషన్లో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఘనమైన నట జీవితానికి పునాది పడింది విజయా సంస్థలోనే. విజయా సంస్థ అధినేతలలో ఒకరైన నాగిరెడ్డి తో ఎన్టీఆర్ అనుబంధం చాలా ప్రత్యేకమైనది. నాగిరెడ్డిని ఎన్టీఆర్ ‘ఫాదర్’ అంటూ సంబోధించేవారు. నాగిరెడ్డి కూడా ఎన్టీఆర్ ను ఎంతో వాత్సల్యంతో చూసుకునేవారు. కాగా, సినిమాల్లో ప్రవేశించేనాటికి ఎన్టీఆర్ బాగా సన్నగా ఉండటంతో కాస్త వ్యాయామం చేయమని నాగిరెడ్డి ఎన్టీఆర్ కు సూచించారు. ఎన్టీఆర్ వ్యాయామం సాధన చేయడం ప్రారంభించారు. అయితే ఒక రోజున నాగిరెడ్డి వద్దకు ఎన్టీఆర్ వచ్చి, బిడియపడుతూ ‘వ్యాయామం చేస్తున్నందు వల్ల తనకి బాగా ఆకలేస్తొందని చెప్పి, కాబట్టి కంపెనీలో పెడుతోన్న ఇడ్లీలు తనకి సరిపోవడం లేదని, మరో రెండు అదనంగా వేయమని చెబితే బాగుంటుందని’ కోరారు. ఏం కావాలన్నా.. ఎంత కావాలన్నా తీసుకోమని నాగిరెడ్డి తన మాటగా చెప్పడంతో ఎన్టీఆర్ అక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్లిపోయారట. అప్పుడు ఎన్టీఆర్ ముఖంలో కనిపించిన సంతోషం నాగిరెడ్డి గారికి ఎంతో సంతృప్తి కలిగించిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: