ప్రస్థుతం నడుస్తున్న కాలం కొరటాల శివకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ‘భరత్ అనే నేను’ మూవీతో బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న కొరటాల చిరంజీవితో ‘ఆచార్య’ ప్రాజెక్ట్ లో చిక్కుకుని రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడు. వరస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల లాంటి దర్శకుడుకి రెండు సంవత్సరాల కాలం వృథా అంటే అతడికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ రీత్యా సుమారు 20 కోట్లకు పైగా పారితోషిక విషయంలో నష్టం అన్న అంచనాలు ఉన్నాయి.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’ మూవీ పూర్తి కాకుండానే అల్లు అర్జున్ తో తీయబోయే మరొక మూవీ ప్రాజెక్ట్ కు ఒకే చేసాడు. యువత రాజకీయాలను కూడ ఒక వృత్తిగా ఎంచుకుని రంగంలోకి దిగినప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది అన్న సామాజిక సందేశం ఈ మూవీ ద్వారా ఇవ్వబోతున్నాడు.


మూవీ ప్రాజెక్ట్ ను కొరటాల తన సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ కు చెందిన యువ సుధ బ్యానర్ అల్లు అర్జున్ సన్నిహితులకు సంబంధించిన ఒక నూతన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకుంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఈవిషయమే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కు అసహనం కలిగించిందని గాసిప్పులు వస్తున్నాయి. దీనికి కారణం గతంలో కొరటాల శివ మైత్రీ మూవీస్ బ్యానర్ పై వరసగా తీసిన ‘శ్రీమంతుడు’ ‘జనతాగ్యారేజ్’ ల తరువాత మరొక మూవీని మైత్రీ మూవీస్ చేస్తానని అప్పట్లో అంగీకరించాడట.


అయితే ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి కొరటాల వరసగా ‘ఆచార్య’ ఆతరువాత బన్నీతో మూవీ తన సొంత నిర్మాణ సంస్థ మరియు బయట బ్యానర్స్ తో కలిపి చేస్తూ ఉండటంతో మైత్రీ మూవీస్ నిర్మాతలు కొరటాలకు అతడు తమకు గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన కొరటాల బన్నీతో తాను తీయబోతున్న మూవీ ప్రాజెక్ట్ లో మైత్రీ మూవీస్ ను కూడ సహ నిర్మాతలుగా మార్చి తాను గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: