మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో టాలీవుడ్ కి హీరో గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ ని అందుకుంది. దాని అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ చిరంజీవి అద్భుత నటన కనబరిచారు.  
ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపుగా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్ మరియు ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ మెగా ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించడం ఖాయమని అంటున్నారు.  

గతంలో తాను తీసిన సినిమాల మాదిరిగా ఈ సినిమాలో కూడా ఆ రెండు సన్నివేశాలను అత్యద్భుతమైన రీతిలో భారీ లెవల్లో తెరకెక్కించాడట దర్శకుడు కొరటాల. రేపు థియేటర్లో సాధారణ ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆ సీన్స్ కు గూజ్ బంప్స్ రావడం ఖాయం అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త కనుక నిజమే అయితే, మెగా ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: