కధ లేకుండా తీసిన చిత్రమే దేవుడు చేసిన మనుషులు , లాజిక్ తో తీస్తే ఇలా ఉండాలి అనే ఎక్స్ పేటేషన్ ఉంటుంది. అలా లేకుండా దేవుడు చేసిన మనుషులు ఉంటుంది. యమలోకంలో చిత్రగుప్తుడు చేతిలోని పుస్తకం చేయి జారి భూలోకంలో పడితే ఎలా ఆశక్తి గా చదువు తారో అంతే ఆశక్తిగా ఈ చిత్రం చూస్తారు అని పూరి జగన్ అంటున్నారు.  ఈ చిత్రం కధను ఇలీయానాకు మొదట చేప్పాను. బొంబాయిలో తన ప్లాట్ లో కూర్చుని ఇలీయానాకు కధ చేపుతుంటే కరెంట్ పోయింది, అయినా కధ చేపుతునే ఉన్నా, ఇలీయానా నాకు కనిపించలేదు కాని నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులే ఈ సినిమా హిట్ కు సంకేతాలు అని పూరి అంటున్నారు.  ఇందులో టాక్సీ డైవర్ పాత్ర ఇలీయానా ది. రవితేజా తో నాకు 5వ సినిమా , రవితేజా అంటే నాకు ఎంతో ఇష్టం, రోకు, మోజు అని పూరి అంటున్నారు దేవుడు చేసిన మనుషులు ఆడియో పంక్షన్ లో.      

మరింత సమాచారం తెలుసుకోండి: