ఖుషి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్టు కోసం పదేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో జల్సా వచ్చినా ఓకే అనిపించింది కాని గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓ పవర్ స్టార్ అభిమాని పవన్ ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా రిజల్ట్ చూసి చెప్పొచ్చు. సినిమా టైటిల్స్ నుండి ఎండ్ కార్డ్ వరకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఊగిపోయేలా ఈ సినిమా తీశాడు డైరక్టర్ హరీష్ శంకర్.

ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ పనిచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. సెప్టెంబ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ఉస్తాద్ టైటిల్ పరిశీలనలో ఉందట.

ఏమో ఇదే టైటిల్ తో రేపు అఫీషియల్ ఎనౌన్స్ చేస్తారని కూడా అంటున్నారు. అంతేకాదు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. దీనితో పాటుగా క్రిష్ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని టాక్. చూస్తుంటే రేపు పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉన్నారు. హరీష్ శంకర్ సినిమాలో పవర్ స్టార్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. పికె ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వస్తే అంతకుమించి అన్నట్టు ఈ సినిమా ఉంటుందని ఊరిస్తున్నాడు హరీష్ శంకర్.                           

మరింత సమాచారం తెలుసుకోండి: