జబర్దస్త్ షోలో తన మార్క్ కామెడీతో అలరిస్తున్న ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హోలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఈరోజు ప్రోమోలో జోకర్ అంటూ హౌజ్ లో ఎంట్రీ ఇస్తూ ఫేస్ రివీల్ చేయకపోయినా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది అతనే అని అంటున్నారు కొందరు. బిగ్ బాస్ హౌజ్ లో అవినాష్ రావడం కన్ ఫాం అయితే తప్పకుండా షోకి మరింత ఫన్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటివారం సూర్య కిరణ్ ఎలిమినేట్ అవగానే కమెడియన్ సాయి కుమార్ ను తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు మరో జోకర్ ను హౌజ్ లోకి పంపిస్తున్నారు.
జోకర్ వెనుక జీవితం అంటూ ఆరంభం అదరగొట్టేలా ఉన్న అవినాష్ బిగ్ బాస్ షోలో ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి. వచ్చేది అవినాష్ అని లీక్స్ వస్తున్నా ఎక్కడో అతను కాకుండా వేరే ఎవరైనా సర్ ప్రైజ్ చేస్తారా అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈరోజు షోలో కచ్చితంగా ఆడియెన్స్ అందరు షాక్ అయ్యేలా.. షో మీద ఆసక్తి మరింత పెంచేలా చేస్తున్నారని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి