‘బిగ్ బాస్ 4’ సీజన్ కు చెప్పుకోతగ్గ స్థాయిలో బుల్లితెర ప్రేక్షకుల నుండి స్పందన రావడంలేదు అని గ్రహించి స్టార్ మా యాజమాన్యం నిన్నరాత్రి నుండి ‘జబర్దస్త్’ ఫేమ్ అవినాష్ ను ఎంట్రీ చేసి బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం మేరకు అవినాష్ ను ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషోలో ఎంటర్ చేయడానికి స్టార్ మా యాజమాన్యం జబర్దస్త్ షో నిర్వాహకులకు 10 లక్షల రూపాయలు కాంపన్ సైషన్ గా ఇచ్చినట్లు గాసిప్పులు వస్తున్నాయి.


అంతేకాదు ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి అవినాష్ ను ఒప్పించడానికి భారీ పారితోషకం కూడ ఆఫర్ చేసినట్లు లీకులు వస్తున్నాయి. ఇలా బిగ్ బాస్ షో నిర్వాహకులు అవినాష్ విషయంలో మోజు పడటానికి ఒక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.


ఈవారం నుండి ఐపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం అవుతున్న పరిస్థితులలో చాలామంది టివి లకు ఆకార్యక్రమం చూస్తూ అతుక్కుపోయే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఐపిఎల్ వల్ల బిగ్ బాస్ షో రేటింగ్స్ కు ఏమాత్రం సమస్య ఏర్పడకుండా ఈ షోను చూసేవారికి మరింత ఆసక్తిని పెంచడానికి అవినాష్ ఎంట్రీ సహాయపడుతుంది అన్నఅంచనాలు వినిపిస్తున్నాయి.

ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా హౌస్ మేట గంగవ్వ తన ఆరోగ్య సమస్యల రీత్యా ఈ షో నుండి వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ ను వేడుకోవడం హైలెట్ గా మారింది. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోలో పాల్గోనప్పుడు అతడికి కుడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతూ గంగవ్వ తన అనారోగ్య సమస్యలు బిగ్ బాస్ తో చెప్పుకోవడం చుసిన వారికి గత సీజన్ తాలుకు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఏదిఏమైనా అవినాష్ ఎంట్రీ 'బిగ్ బాస్ 4' షోకి ఎంతవరకు రేటింగ్స్ తెచ్చి పెడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: