ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్లలో ఒకరైన కాజల్‌ అగర్వాల్‌ అతి త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ముంబయ్‌కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిట్‌చ్లుతో చందమామ ఏడడుగులు వేయబోతోంది. వీళ్ళిద్దరిదీ అరెంజ్డ్‌ కమ్‌ లవ్‌ మ్యారేజ్‌ అని టాక్‌. కొన్నాళ్ళుగా కాజల్‌ పెళ్ళి కబురు వినబడుతూ వుంది. కాని అగర్వాల్‌ ఫ్యామిలీ కన్‌ఫర్మ్‌ చెయ్యడం లేదు. లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఏంటంటే… ఆల్రెడీ పెళ్ళి ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? వంటి విషయాలు మాట్లాడుకున్నారట..

కాజల్‌ అగర్వాల్‌కి కాబోయే భర్తకి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీ వుంది. ఇంటిని అందంగా డెకరేట్‌ చెయ్యడం అతడికి ఇష్టం. ‘డిసెర్న్‌ లివింగ్‌’ కంపెనీ పెట్టిన అతడి గురించి కొన్ని మ్యాగజైన్లు ఆర్టికల్స్‌ రాశాయి. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలిసిన గౌతమ్‌, కాజల్‌ లవ్‌లో పడిన విషయం పెద్దలకు తెలుసట. ఇద్దరి ఫ్యామిలీలు మాట్లాడుకుని పెళ్ళి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌లో కొందరు హీరోలు పెళ్ళి పీటలు ఎక్కారు. రానా, నితిన్‌, నిఖిల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యారు.

లాక్‌డౌన్‌ తరువాత పెళ్ళిల్లు జరగలేదు. ముంబయ్‌లోనూ లాక్‌డౌన్‌ తరువాత జరగబోయే మొదటి సెలబ్రిటీ మ్యారేజ్‌ కాజల్‌దే అని టాక్‌. ఆల్రెడీ కాజల్‌ పేరెంట్స్‌ వినయ్‌ అగర్వాల్‌, సుమన్‌ అగర్వాల్‌ పెళ్ళి ఏర్పాట్లు చెయ్యడం స్టార్ట్‌ చేశారట. ముంబయ్‌లోని కాజల్‌ ఇంటికి దగ్గరలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పెళ్ళి జరుగుతుందని టాక్‌.

కాగా కాజల్ ఫ్యాన్స్ ఈ వార్త వినగానే షాక్ కి గురయ్యారు. ఎందుకంటే కాజల్ కి ఎంత ఫాలోయింగ్ వుందో తెలుసు. చాలా మంది యువకుల కలల రాణి. ఇక తను పెళ్లి చేసుకుంటుంది అనే వార్త రాగానే కాజల్ ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు.

ప్రస్తుతం కాజల్ మోసగాళ్లు సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇంకా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా వస్తున్న ఇండియన్ 2 సినిమాలోనూ, అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: