కోలీవుడ్ యువ హీరో అధర్వ మురళి గోవా అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తెలుస్తుంది. అయితే ఆమె ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. తమిళంలో యువ హీరోగా సత్తా చాటుతున్న అధర్వ మురళి తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న అధర్వ మురళి గోవాలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తెలుస్తుంది. ఆమెతో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడట. అయితే పెళ్ళి టైంకు ఆమెను రివీల్ చేస్తారని టాక్.

ఈమధ్యనే తన సోదరుడు ఆకాష్ మురళి పెళ్లి జరిగింది. తమిళ హీరో మురళి తనయుడిగా అధర్వ మురళి హీరోగా స్టార్ క్రేజ్ తెచ్చుకోలేకపోయినా సరే వరుస సినిమాలైతే చేస్తున్నాడని తెలుస్తుంది. గోవా భామలో ప్రేమలో పడ్డ అధర్వ తన సీక్రెట్ రిలేషన్ మీద నోరు విప్పడం లేదు.

తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో డైరక్టర్ రోల్ చేశాడు అధర్వ మురళి. అయితే అతను హీరోగా నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా గుర్తింపు తెచ్చుకోవట్లేదు. తమిళంలో మాత్రం అతను ఓ మోస్తారు క్రేజ్ తో సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా అధర్వ మురళి రాబోయే రోజుల్లో స్టార్ అవుతాడని మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం చేతిలో రెండు ప్రాజెక్టులు ఉండగా తెలుగులో కూడా స్ట్రైట్ సినిమా చేయాలని చూస్తున్నాడు అధర్వ మురళి. తమిళంలోనే కాదు తెలుగులో కూడా మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నాడు అధర్వ మురళి. తప్పకుండా అధర్వకు తెలుగులో మంచి ఫాలోయింగ్ వస్తుందని చెప్పొచ్చు.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: