కేజీఎఫ్ చాప్టర్ 1 లో రాకీ భాయ్ ఫ్యామిలీ లైఫ్ మనకి కనిపించదు. చిన్నతనంలో అమ్మతో రాకీ కలసి తిరిగే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. చిన్నపిల్లవాడిగా రాకీ మెప్పిస్తాడు. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాకీ ఫ్యామిలీ లైఫ్ పై కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాకీ భార్య రీనాగా శ్రీనిథి శెట్టి కనిపించబోతోంది. ఫస్ట్ పార్ట్ లో రాకీ లవర్ గా కనిపించిన శ్రీనిధి, సెకండ్ పార్ట్ లో భార్యగా కనిపిస్తుందనమాట. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ, పెళ్లి సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు.
శ్రీనిధి శెట్టి పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్ చిత్ర యూనిట్ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ తో ఈ విషయం స్పష్టమవుతోంది. భార్య భర్తకోసం తలుపు తీస్తున్నట్టు కనిపిస్తున్న దృశ్యాన్ని దర్శక నిర్మాతలు విడుదల చేశారు. హ్యాపీ బర్త్ డే టు రీనా అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

కేజీఎఫ్ చాప్టర్ 1 ఊహించని విజయంతో చాప్టర్-2ని మరింత పగడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. హీరో యశ్ పాత్రకి ధీటుగా విలన్ సంజయ్ దత్ పాత్రను తీర్ది దిద్దాడు. సంజూ బాబా కూడా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే హీరో యశ్ కి సంబంధించిన సన్నివేశాల్ని కూడా చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందుగానే కేజీఎఫ్ -2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మతాలు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఈ పాటికే సినిమా షూటింగ్ పూర్తయి ఉండేది. అయితే లాక్ డౌన్ వల్ల పూర్తిగా లేటయిన షూటింగ్ ఇటీవలే ఫుల్ స్పీడ్ లో కొనసాగుతోంది. నటీనటులంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కేజీఎఫ్ పార్ట్ 1 ని మించిన భారీ హిట్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ స్కెచ్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: