టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు ఊహించని షాకింగ్ కాంబినేషన్ కు రంగం సిద్ధం అవుతోంది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనులు కలసి ఒక  సినిమా చేసే అవకాశాలున్నాయని లీకులు వస్తున్నాయి. విజయ్ దేవరకొండకు  వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో ప్రస్తుతం అతడి దృష్టి అంతా ఒక భారి హిట్ పై ఉండటంతో అలంటి భారీ హిట్ ఇవ్వగల   దర్శకుడి గురించి ఆలోచనలు చేస్తున్నాడు.


ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాను చేస్తున్న విజయ్ తన సినిమాలకు సంబంధించి స్టార్ డైరెక్టర్లను వరసగా లైన్ లో  పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విజయ్ కొరటాల శివ పై కూడ కన్నేశాడు అన్న వార్తలు వస్తున్నాయి.  


ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడ సినిమా చేయడానికి విజయ్ ఆశక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను ‘భద్ర’ సినిమా చేసిన తరువాత మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను దిల్ రాజుతో ఒక్క సినిమా చేయడానికి అంగీకరించడమే కాకుండా అతడి దగ్గర అడ్వాన్స్ కూడ తీసుకున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.


వాస్తవానికి ఇంద్రగంటి మోహనకృష్ణ విజయ్ కాంబినేషన్ లో దిల్ రాజు ఒక మూవీని ప్లాన్ చేసాడు. అయితే ‘వి’ రిజల్ట్ తర్వాత అది  పెండింగ్ లో  పెట్టి ఇప్పుడు బోయపాటి శ్రీను విజయ్ కాంబోలో సినిమాచేయడానికి దిల్ రాజ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తల హడావిడి నడుస్తోంది. విజయ్ ఇప్పటి వరకు పూర్తి మాస్ సినిమా చేయకపోవడంతో ఈ జోనర్ పై విజయ్ కు బాగా ఆసక్తి ఉన్నట్లు టాక్.  బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. మరోవైపు విజయ్ చేతిలోనూ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కావడానికి కనీసం మరో ఏడాది పై గా సమయం పట్టినా ఆశ్చర్యం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: