‘బాహుబలి’ తరువాత వచ్చిన సాహో ఘోరమైన డిజాస్టర్ గా మారడంతో ఇక ప్రభాస్ అభిమానుల ఆశలు అన్ని ‘రాధే శ్యామ్’ పైనే ఉన్నాయి. దీనితో ఈ సినిమా పై రోజురోజుకి విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ  పీరియాడిక్ టచ్ ఉన్న లవ్ స్టొరీ.  


30 - 40 ఏళ్ల వెనుకటి కాలం నేపథ్యంలో ఈమూవీ కథ నడుస్తుందన్న లీకులు వస్తున్నాయి. ఈసినిమా పోస్టర్ల అన్నింట్లోనూ వింటేజ్ టచ్ కనిపిస్తూ ఉండటంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను ప్రకటించడంతో ఈమూవీలోని హీరో హీరోయిన్స్ పేర్లు శ్యామ్ రాధ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.


అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి విడుదలచేసిన పోస్టర్స్ లో  హీరో హీరోయిన్లను మాత్రం వేరే పేర్లతో పరిచయం చేయడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.కానీ కొన్ని రోజుల కిందట పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్ర పేరును ప్రేరణ గా పరిచయంచేశారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన మరో పోస్టర్ లో ప్రభాస్ పాత్రను విక్రమాదిత్యగా పరిచియం చేసారు.


దీనితో ఈ సినిమా  టైటిల్ కు ఈ సినిమా కధకు సంబంధం ఉండదా అన్నసందేహాలు ప్రభాస్ అభిమానులలో బాగా బలపడుతున్నాయి. అయితే  విక్రమాదిత్య ప్రేరణ అనే పేర్లు పాత తరానికి సంబంధించిన పేర్లు లా అనిపిస్తున్న పరిస్థితులలో ఆ పాత్రలు చనిపోయి పునర్జన్మ ఎత్తేక వారి పేర్లు శ్యామ్ రాధ గా మారాయ అంటూ ప్రభాస్ అభిమానులు తమ హీరో పుట్టిన రోజునాడు ఊహా గానాలు చేస్తూ ప్రభాస్ పుట్టిన రోజును నేడు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పూర్వ జన్మల కధలు టాప్ హీరోల సినిమాలలో కనిపించలేదు. దీనితో ఈ చేంజ్ ప్రభాస్ కు బాగా కలిసి వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: