యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి. అంతకుముందు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అక్కడక్కడ పలు సినిమాలతో పాటు పలు సీరియల్స్ కు అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మరొకసారి ఎన్టీఆర్ తోనే ఆయన తెరకెక్కించిన సింహాద్రి సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకుని రాజమౌళికి విపరీతమైన పేరును తెచ్చిపెట్టింది.

ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా వరుస అవకాశాలతో కొనసాగిన రాజమౌళి ప్రతి ఒక్క సినిమాతో విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన తీసిన బాహుబలి రెండు భాగాలు ఒకదానిని మించి మరొకటి అత్యద్బుత విజయాన్ని అందుకోవడం అలానే ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడడం జరిగింది. కాగా ఈ సినిమాని రాజమౌళి వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నారు రాజమౌళి. ఇక తన కెరీర్ లో తనకు ఎంతో ఇష్టమైనటువంటి మహాభారతాన్ని ఎన్ని భాగాలుగా అయినా సరే తీస్తాను అంటూ చాలా సందర్భాల్లో రాజమౌళి చెప్పడం జరిగింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కర్ణ పేరుతో ఒక భారీ పౌరాణిక సినిమాని రాజమౌళి తీయనున్నారు అనేటువంటి వార్త కొద్ది రోజులుగా పలు టాలీవుడ్ వర్గాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వాస్తవానికి అన్న ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించి తెరకెక్కిన దానవీరశూరకర్ణ సినిమా మాదిరిగా రాజమౌళి దీనిని తెరకెక్కించనున్నాడని అలానే ఈ సినిమాలో కర్ణుడు సహా అర్జునుడు, కృష్ణుడు వంటి ప్రధాన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుత నటనను ప్రదర్శించనున్నారని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ స్క్రిప్ట్ రాసుకున్నారని మహేష్ బాబు సినిమా అనంతరం దీన్ని ప్రకటిస్తారు అని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే డెన్నిస్ సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: