సముద్రం ఒడ్డున నగ్నంగా పరుగులు తీసిన ఫోటోలను షేర్ చేసిన ఆ నటుడికి మద్దతు పలుకుతూ అది ఓ అందమైన ఫోటో అంటూ హితవు పలికింది ఆ స్టార్... ఒంటిపై దుస్తులు లేకుండా బూడిద పూసుకుని తిరిగే బాబాల వైఖరి దైవత్వం అనుకుంటే...... మరి ఆ నటుడి నగ్న ఫోటో ని మాత్రం ఎందుకు తప్పు పడుతున్నారు అంటూ పేర్కొన్నారు... బాలీవుడ్ స్టార్ పూజాబేడి. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ తన పుట్టిన రోజు సందర్బంగా.... వినూత్నంగా కనిపించాలి అనుకున్నాడు. గోవాలో ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు గాను గోవాలోని బీచ్ లో నగ్నంగా పరుగులు తీసిన విషయం అందరికీ తెలిసిందే.  

అయితే ఇలా నగ్నంగా బాహ్యప్రపంచంలో సంచరించడం తప్పంటూ.... న్యూసెన్స్ క్రియేట్ చేశాడు అంటూ... ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విధితమే. అయితే ఈ రకంగా ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు గాను అతన్ని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా పలురకాలుగా మిలింద్ సోమన్ పై చర్చ కొనసాగుతుండగా..... కొందరు ఈయనను సమర్థిస్తూ మద్దతు ఇస్తే..... మరికొందరు ఇదేం పిచ్చి పని అంటూ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మిలింద్ కు మద్దతు పలుకుతూ బాలీవుడ్ స్టార్ పూజా బేడీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ ఫోటోలో అంత అసభ్యకరమైన విషయం ఏమీ లేదు.... అదో అద్భుతమైన ఫోటో. అయినా చూసే కళ్లను బట్టి అసభ్యత లేక అద్భుతంగా అన్నది ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ నగ్నత్వం అనేది నేరంగా పరిగణిస్తే.. అప్పుడు మన దేశంలో ఉన్న నాగబాబాలు అందరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే. వారు కూడా ఒంటికి బూడిద రాసుకొని నగ్నంగానే తిరుగుతుంటారు.... వారి విషయంలో తప్పు కానప్పుడు, మరి మిలింద్ విషయంలో మాత్రం ఎలా  నేరం అయింది అంటూ..? ప్రశ్నించారు. మిలింద్ సోమన్ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తి తన ఫిట్నెస్ విషయమై ఓ అందమైన ఫోటోను షేర్ చేస్తే.....దాన్ని తప్పుడు ఉద్దేశ్యంతో చూసి విమర్శలు చేస్తున్నారంటూ వ్యక్తం చేశారు పూజ.

మరింత సమాచారం తెలుసుకోండి: