ఆచార్యకు కష్టాలు తీరడం లేదు. ఆచార్యకు ఇబ్బందులు తొలిగాయి.. ఇక మెగాస్టార్‌  అడుపెట్టడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో మెగాస్టార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో.. చిరంజీవి ఇప్పట్లో బైటకొచ్చే పరిస్థితి లేదు. ఆచార్య మొదలైనప్పటి నుంచి చిత్ర యూనిట్‌ ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉంది.

చిరంజీవి ప్రస్తుతం కరోనా పాజిటివ్‌తో ఇబ్బందిపడుతుంటే.. దర్శకుడు కొరటాలది రెండేళ్లన్నర ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. భరత్‌ అనే నేను రిలీజ్‌ వెంటనే టైం తీసుకోకుండా చిరంజీవి సినిమాకు కమిట్‌ అయ్యాడు కొరటాల. అప్పటికే సైరా షూటింగ్‌లో వున్నాడు చిరంజీవి. సైరా షూటింగ్‌ నత్తనడక నడిచి రిలీజ్‌ కావడానికి ఏడాది పట్టింది. వెంటనే కొరటాల సినిమా మొదలైందా? అంటే అదీ లేదు.  రెండున్నర సంవత్సరాలుగా చిరంజీవినే నమ్ముకున్నాడు కొరటాల. లేదంటే ఈ టైంలో రెండు సినిమాలు చేసేవాడు దర్శకుడు.

కరోనా దెబ్బ ఆచార్యకే కాదు.. ప్రపంచం మొత్తానికి తగిలింది. అయితే..  ఆచార్య కథ తనదే అంటూ.. రాజేష్‌ అనే రచయిత ఆరోపణ చేయడంతో.. వివాదాస్పదమైంది. కథలో మార్పులు చేర్పులు చేశారంటూ.. దీనివల్లే ఆచార్య ఇంకా మొదలుకాలేదన్న కథనాలు పుట్టుకొచ్చాయి. ఇందులో నిజమెంతోగానీ.. వారం క్రితమే ఈనెల 9న మొదలవుతుందని ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈలోగాను ఆచార్యను అడ్డుకుంది.

షూటింగ్‌లో పాల్గొనే నటీనటులు.. సిబ్బంది మొత్తానికి కరోనా టెస్టులు చేయించారు. ఇందులో చిరంజీవికి పాజిటివ్‌ అని తేలింది. మినిమం నెల రోజుల వరకు చిరంజీవి బైటకొచ్చే పరిస్థితి లేదు. ఆచార్య మొదలవుతోందన్న ఆనందం ఫ్యాన్స్‌కు దక్కలేదు. తనను కలిసిన వారందరూ.. కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరంజీవి సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ లెక్కన చిరంజీవి ఆమధ్య మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచే కూతురు పెళ్లికి వెళ్లారు. నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ను కలిశారు. అలాగే.. మనవరాళ్లతో కలిసి కెసిఎఫ్‌ చికెన్‌ వండాడు. చిరంజీవికి కరోనా రాకతో వీళ్లందరూ టెస్టులు చేయించుకోవాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: