ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలతో అతను స్టార్ గా ఎదిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా కూడా హిట్ అనిపించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో అనన్యా పాండేతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. అనన్యా పాండే తెలుగులోకి రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు విజయ్. దక్షిణాదిలో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పేస్తున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ చెప్పాడు అంటే తప్పకుండా అనన్యా పాండేకి తెలుగులో సూపర్ క్రేజ్ రావడం పక్కా అని చెప్పొచ్చు.

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ విజయ్ ఫైటర్ సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేశాడు. ఆల్రెడీ సౌత్ లో అన్ని భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఫైటర్ తో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి విజయ్ అనన్యా పాండే గురిచి అంత స్పెషల్ గా చెప్పాడు అంటే తప్పకుండా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉండేలా ఉంది.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: