ప్రిన్స్ మహేష్ బాబు తాను టాప్ హీరోను అని గర్వపడకుండా తన పిల్లలతో తన కుటుంబ సభ్యులతో చాల సరదాగా గడుపుతాడు. ముఖ్యంగా పార్టీ కల్చర్ కు చాల దూరంగా ఉండే మహేష్ షూటింగ్ లు లేకపోతే తన కాలాన్ని అంతా తన పిల్లలతోనే గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.


ఈమధ్యనే మహేష్ తన భార్య పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళి వచ్చి తన ఇంటిలో రిలాక్స్ అవుతున్నాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహేష్ తో సితార చాల ఎంజాయ్ చేస్తున్నట్లు నమ్రత అనేక ఫోటోలు షేర్ చేస్తోంది. మహేష్ తన సెల్ ఫోన్ లో ఎదో ఒక ఫోటో చూస్తున్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించిన సితార మహేష్ దగ్గర నుండి ఆ సెల్ ఫోన్ ను లాక్కోవడానికి ప్రయత్నించింది.


అయితే మహేష్ వద్దు అని చెపుతున్నా వినకుండా సితార మహేష్ సెల్ ఫోన్ ను లాక్కుని ఆ సెల్ లోని మహేష్ చూస్తున్న ఆ ఫోటోను సితార చూస్తున్నప్పుడు మహేష్ సిగ్గుతో సితార తల   పై తన తల పెట్టి సిగ్గు పడుతున్నాడు. ఈ మూమెంట్స్ ను క్యాచ్ చేసిన నమ్రత తన సెల్ కెమెరా తో ఆ మూమెంట్స్ ను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఈ ఫోటోలు షేర్ అయిన కొన్ని క్షణాలలోనే వైరల్ గా మారి ఈ తండ్రి కూతుళ్ళ అనుబంధం పై మహేష్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన చిన్నతనంలో సితార మహేష్ సినిమాలోని పాటలు వింటూ నిద్రపోయేది అని నమ్రత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మహేష్ తన తల్లితండ్రుల కంటే తన అమ్ముమ్మని విపరీతంగా ప్రేమించేవాడు. ఆమె చనిపోయాక బెంగతో ఆరు నెలలు ఇంటి నుంచి బయటకు కూడ రాలేదు అని అంటారు. అమ్ముమ్మ పై అంత ఇష్టం ఉన్న మహేష్ కు ఆమె మళ్ళీ తన కూతురు రూపంలో పుట్టింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: