చిత్ర పరిశ్రమలో ఏఆర్‌ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సంగీత  ఆస్కార్‌ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డ్ సాధించి ఇండియాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్. ఇతడి పేరు చెబితే చాలు కుర్రకారు హుషారెత్తిపోతారు. జయహో రెహమాన్ అంటూ నినదిస్తారు. ఇతడు టేకాఫ్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే విజయం సాధించాల్సిందే. చిత్ర పరిశ్రమలో పేరు పొందిన డైరెక్టర్లు ఒక్కసారైనా రెహమాన్‌తో పనిచేయాలని ఆకాంక్షిస్తారు. అలాంటి రెహమాన్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు.

బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాఫ్టా.. నెట్‌ఫ్లిక్స్‌ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కాళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఐదు రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది.  తన ఎంపికపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందింస్తూ.. ‘ నాకు చాలా సంతోషంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని తెలిపారు.

ఇక బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్‌తో కలిసి భారత్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. క్రీడలు, కళలు, సినిమాలు మొదలైన రంగాల్లో అధ్భుత ప్రతిభ చూపిన వారిని గుర్తించి కమిటీకి నివేదించడం జరుగుతుంది. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఈ పని చేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాకుండా బాఫ్టాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. బాఫ్టా అవార్డులు కూడా ఆస్కార్ అంతటి ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: