కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించగా నాగబాబు, నాజర్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు చేశారు. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎంతో ఖుషి అయ్యారనే చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా తెరకెక్కనున్నట్లు కొన్ని నెలలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా దీనికి సంబంధించి ఎటువంటి వార్త బయటకు రాకపోవడంతో ఒకవేళ ఈ సినిమా క్యాన్సిల్ అయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ప్రారంభానికి బంగారమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట మూవీ యూనిట్.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినటువంటి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి రోజున ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. అదే రోజున అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుందట .మరోవైపు దీనికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తయిందని వారి వివరాలు కూడా అదే రోజున అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. మొదటి భాగాన్ని మించేలా ఈ రెండో భాగం మరింతగా ప్రేక్షకాభిమానులను అలభిస్తుందని అలానే రిలీజ్ తర్వాత పక్కాగా సక్సెస్ సాధిస్తుందని బంగార్రాజు యూనిట్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది......!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి