సూపర్ స్టార్ మహేష్ కు ట్విట్టర్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ చేరారు. మహేష్ కరోనా లాక్ డౌన్ టైం లో తన ఫ్యామిలీతో చేసిన ఎంజాయ్ ను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన రెగ్యులర్ అప్డేట్స్ తో మహేష్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇక ఇదే మహేష్ ను ఎక్కుమంది ఫాలో అయ్యేలా చేసింది. అభిమాన హీరో గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

ఎవరో చెప్పడం కన్నా ఆ విషయాన్ని తనే స్వయంగా చెబితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మహేష్ పెట్టే ప్రతి పోస్ట్, కామెంట్ ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకే మహేష్ వెంట అంతమంది క్రేజీ ఫాలోవర్స్ వచ్చారని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2021 జనవరి నుండి రెగ్యులర్ షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.



 



మరింత సమాచారం తెలుసుకోండి: