
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈయన కుమారుడుని లాంచ్ చేసే బాధ్యత శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నాడట. నిజానికి శ్రీకాంత్ అడ్డాల కూచిపూడి వారి వీధిలో అనే ఒక సినిమా సిద్ధం చేశాడని అందులో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా అండుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చంటి అడ్డాల కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్నారట. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి టాలెంటెడ్ దర్శకుడు అనిపించుకున్నాడు.
కొత్త బంగారులోకం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకోవడం తో చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు సురేష్ బాబు పుణ్యమా అని ఆయన వెంకటేష్ తో నారప్ప సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ లోనే చంటి అడ్డాల కుమారుడు సినిమా కూడా ఉందని అంటున్నారు.