ఈ మధ్య కాలంలో ఈటీవీలో బుల్లితెర  షోస్ హవా  ఎంతలా పెరిగి పోయినదో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  రోజు రోజుకి సరికొత్త షో లు  తెరమీదికి వస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వినుత్నమైన కాన్సెప్టుతో తెరమీదికి వస్తూన్న   బుల్లితెర ప్రోగ్రామ్స్  అందరినీ కట్టిపడేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే జబర్దస్త్, క్యాష్, ఢీ  లాంటి షోలు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే త్వరలో సరికొత్త షో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే టైటిల్ తో  సరికొత్త షో సిద్ధం అయింది. ఈటీవీ లో ఇప్పుడు వరకు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది ఈ టీవీ యాజమాన్యం.  ఇక ఈ షో కి సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు విడుదలై ప్రేక్షకుల అంచనాలు పెంచేశాయి. ఇటీవలే  మరో ప్రోమో విడుదలవ్వగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.



 ఈ ప్రోమో లో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తన టాలెంట్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే విడుదలైన ప్రోమోలో  భాగంగా చేసిన ఒక ఐటెం సాంగ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి. సాధారణంగా సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేస్తారు..  ఇక ఐటమ్ సాంగ్ అంటే ఎంతో  హాట్ గా ఉంటది అయితే ఇటీవలే విడుదలైన ప్రోమో లో ఉన్న ఐటమ్ సాంగ్ మాత్రం సినిమాలు కాదు అంతకు మించి అనే రేంజ్ లో ఉంది. ఈ వెన్నెల రాత్రి కి.. కావాలా కౌగిలి అంటూ  మొదలైన సాంగ్ లో చాందిని అనే ఆర్టిస్ట్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: