ఈటివి ఢీ షోలో జడ్జ్ గా ఉంటున్న శేఖర్ మాస్టర్ ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా సరే ఢీ షోని మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈ షోలో ఆయన జడ్జ్ మెంట్ సూపర్ అనేస్తున్నారు. గత కొన్ని సీజన్లుగా శేఖర్ మాస్టర్ ఢీలో జడ్జిగా కొనసాగుతున్నారు. అక్కడ తన తోటి జడ్జులతోనే కాదు ఫీమేల్ యాంకర్స్ తో కూడా శేఖర్ మాస్టర్ స్టెప్పులేస్తున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ షోలో కూడా శేఖర్ మాస్టర్ అదరగొడుతున్నాడు.

లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్ క్వీన్ టీం లీడర్స్ రష్మీ, దీపికలతో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ వేశాడు. రష్మీతో రొమాంటిక్ సాంగ్ కామన్ అనిపించినా కొత్త యాంకర్ దీపికని కూడా శెఖర్ మాస్టర్ వదిలిపెట్టలేదు. ఆమెతో కూడా డ్యాన్స్ మూమెంట్ చేశాడు. శేఖర్ మాస్టర్ ని చూసి అందరు అసూయ పడేలా ఇద్దరు ముద్దు గుమ్మలతో డ్యాన్స్ వేశాడు. ఢీ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది అంటే అందుకు ప్రధాన కారణం శేఖర్ మాస్టర్ వల్లే అని చెప్పొచ్చు.

ఢీ 13వ సీజన్ లో ఎప్పటిలానే రష్మీకి లైన్ వేస్తూ కనిపిస్తున్నాడు సుధీర్.. అయితే కొత్త యానక్ర్ దీపికని లైన్ లో పెట్టడానికి హైపర్ ఆది తెగ ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆమె మాత్రం ఆదిని అన్నయ్య అనేసింది. అయితే వీళ్ల పని ఇలా ఉంటే ఇద్దరితో ఓ రేంజ్ లో రొమాంటిక్ మూమెంట్స్ వేసే ఛాన్స్ అందుకున్నాడు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఫాం చూస్తుంటే మరో పది సీజన్ల దాకా ఇదే జోరు కొనసాగించేలా ఉన్నారు.
                                             

మరింత సమాచారం తెలుసుకోండి: