కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మొదట్లో హిట్ కోసం వేచి చూసినా...ఆ తరవాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా వుంది. ఇటీవల విడుదలైన "క్రాక్" సినిమా హిట్ తో మరింత జోష్ మీద ఉంది. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న "వకీల్ సాబ్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా "సలార్" లోనూ నటిస్తోంది. ఈ సినిమా కోసం శృతిహాసన్ భారీ రెమ్యునేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ అమ్మడి ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ప్రియుడితో బ్రేక్ అయ్యిన శృతిహాసన్ మరొకరితో ప్రేమలో పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో ఇటీవల ముంబై రోడ్లపై బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కింది ఈ భామ. కానీ బాయ్ ఫ్రెండ్ ముఖానికి మాస్క్ ఉండటంతో ఎవరా అని క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇక ఇటీవల శృతి హాసన్ బర్త్ డే వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా డూడుల్ ఆర్టిస్ట్ సాంతను హాజరికా శృతి ని హగ్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టినరోజు విషెష్ చెప్పాడు. అంతే కాకుండా లవ్ సింబల్ పెట్టడంతో అమ్మడి కొత్త బాయ్ ఫ్రెండ్ అతడేనని అర్థమయ్యింది. ఇక తాజాగా సంతాను తో లవ్ పై శృతి హాసన్ స్పందించింది. అదంతా తన వ్యక్తిగత విషయమని చేప్పేసింది. ప్రేక్షకులకు కావాల్సింది తన సినిమాల గురించి మాత్రమే నని తన పర్సనల్ విషయాలు అవసరం లేదని చెప్పింది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితం..వృత్తిజీవితం ను వేరు చేసి చూడటం ప్రజలకు అంత సులభం కాదని ..కానీ తను మాత్రం వృత్తిగత జీవితంపైనే దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది. అభిమానులు కూడా తాను చేస్తున్న సినిమాలపైనే ఫోకస్ పెట్టాలంది. కానీ మొత్తానికి సంతాను తో ప్రేమలో లేనని మాత్రం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: