అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంతకుముందు కెరీర్ పరంగా మంచి సక్సెస్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసి వాటితో కొంత ఢీలా పడ్డ అఖిల్, ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ తో పక్కాగా హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నారట.

మంచి లవ్ కం ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది .కాగా ఈ సినిమా ఈ ఏడాది జూన్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అయితే దీని తరువాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ రోల్ ని అఖిల్మూవీ లో పోషిస్తున్నట్లు టాక్.

ఇక ఆ పాత్ర కోసం ఇప్పటికే శారీరకంగా ఎంతో ఫిట్ గా తయారైన అఖిల్, అతి త్వరలో దానియొక్క ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించనున్నారని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లైతే అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు ఇటు సురేందర్ రెడ్డి సినిమాలు రెండింటితో కూడా రెండు భారీ సక్సెస్ లు అందుకునేందుకు అఖిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ రెండు మూవీస్ తరువాత అఖిల్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవి అతడికి ఎంతవరకు సక్సెస్ అందిస్తాయో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: