ఈ మధ్య కాలంలో సింగర్ సునీత పెళ్లి తర్వాత హడావిడి కాస్త తగ్గినట్టు కనిపించిన తాజాగా టాలీవుడ్ కుర్ర హీరో, కేరింత ఫెమ్ సుమంత్ అశ్విన్ పెళ్లి పీటలు ఎక్కడంతో మళ్ళి పెళ్లి బాజాలు వినబడ్డాయి. ఈ కుర్ర హీరో మరెవరో కాదు. సీనియర్ నిర్మాత అయినా ఎం ఎస్ రాజు కుమారుడే ఈ సుమంత్ అశ్విన్. రాజు గారు వర్షం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఇక సుమంత్ శనివారం రోజున మూడు మూళ్ళ బంధంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లో సుమంత్ వివాహం అట్టహాసంగా జరిగింది. సుమంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు దీపికా కాగా, వీరి పెళ్లి పెద్ద సందడి లేకుండానే జరిగిపోయింది. అందుకు కారణం ఈ పాండెమిక్ పరిస్థితులే.

 ఈ వివాహానికి కేవలం అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక సుమంత్ దీపికా ల వివాహానికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుమంత్ వివాహానికి హైదరాబాద్ లోని వారి ఫామ్ హౌస్ వేదికగా మారింది. ఇక సుమంత్ భార్య దీపిక విషయానికి వస్తే ఆమె డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరో గా తూనీగ  తూనీగ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా, కేరింత సినిమాతో మంచి గుర్తింపు లభించింది.  ఇక సుమంత్ తాజా  'ఇదే మా కథ'  చిత్రం మార్చ్ 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఎం ఎస్ రాజు గారు విషయానికి వస్తే అయన కేవలం ప్రొడ్యూసర్ గానే కాదు, దర్శకుడిగా మారి వాన సినిమాను తెరకెక్కించారు. వ‌ర్షం,  దేవీ పుత్రుడు, ఒక్కడు, శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, మనసంతా నువ్వే, నీ స్నేహం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన, మస్కా వంటి సినిమాలను నిర్మించిన ఘనత ఆయనకు దక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: