ఆ యంగ్ హీరో మరెవరో కాదు వర్షం దర్శకుడైన శోభన్ కుమారుడు. పేరు సంతోష్ శోభన్. యూవీ క్రియేషన్స్ తో మాట్లాడి అనుకున్నట్టుగానే ప్రభాస్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఇప్పించాడు.ఇక వర్షం దర్శకుడు శోభన్ 2008లో గుండెపోటుతో మరణించాడు.ప్రభాస్ కి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా వర్షం.అంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆ దర్శకుడి రుణాన్ని తీర్చుకోడానికి ప్రభాస్ పూనుకున్నాడట. ఆ దర్శకుడు కొడుకు ఇదివరకే తను నేను, పేపర్ బాయ్ అనే రెండు సినిమాలు చేశాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ సపోర్ట్ తో ఒక సినిమా చేశాడు.
త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇక ఆ సినిమా ప్రమోషన్ విషయంలో సహాయం చేయడానికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడట. ఎలాగైనా సంతోష్ కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తేవాలని ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఆ యువ హీరో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి