ఉప్పెన సినిమాతో తెలుగు పరిశ్రమలో అందరి నోట్లో నానుతున్నాడు బుచ్చి బాబు. నూతన దర్శకుడే అయినా ఉప్పెన సినిమా ఆయన తెరేకెక్కించిన విధానం అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఇంకా చెప్పాలంటే సీనియర్ డైరక్టర్స్ మాదిరిగా సినిమా ఎక్కడ చిన్న ఫ్లాస్ కూడా లేకుండా చేశాడు. ఇక ఈ సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట కూడా క్రేజీగా ఉందని చెప్పొచ్చు. సినిమా ద్వారా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా.. కృతి శెట్టి కూడా బేబమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరక్టర్ మైత్రి మూవీ మేకర్స్ తోనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తాడని టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో 80ల కాలం నాటి కథతో వస్తున్నాడట బుచ్చి బాబు. ఈ సినిమాకు కూడా వైజాగ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తారక్ తో బుచ్చి బాబు సినిమా అనగానే సిన్మాపై అంచనాలు పెరిగాయి. నిజంగా అదే జరిగితే ఇక మాములు రచ్చ కాదు.

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న తారక్సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా బిగ్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. సెకండ్ సినిమానే కాదు బుచ్చి బాబు థర్డ్ మూవీ కూడా మైత్రి మేకర్స్ బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: