ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండటానికి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పోలీసులకు విషయంలో ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టడానికి కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే ఇక ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ఏమవుతుంది అన్న విషయంపై కొన్ని సినిమాల్లోని సన్నివేశాలని ఉదాహరణగా చూపించడం లేదా క్రికెట్ ఆట లోని సన్నివేశాలను కూడా ఉదాహరణగా చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే కాదు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ  ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన కేరళ పోలీసులు దీనికోసం వినూత్నంగా ఆలోచించారు ఇక ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఒక సరికొత్త ఐడియా తో ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వాడుకున్నారు కేరళ పోలీసులు.ఇటీవల కేరళ పోలీసులు పోల్  అనే యాప్ ప్రారంభించారు.


 ఆపదలో ఉన్న వారు ఎవరైనా సరే పోల్ యాప్ ద్వారా సందేశం పంపారు అంటే చాలు ఇక వెంటనే పోలీసులు స్పందించి ఆపద నుంచి బయట పడేయడానికి అప్రమత్తం అవుతూ ఉంటారు.  ఇక ఈయాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా లోని ఒక సీన్ వాడుకున్నారు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్న సమయంలో ఇక అకస్మాత్తుగా పోలీస్ డ్రెస్ లో అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు అల్లు అర్జున్ ఇక ఇదే ఎంట్రీని యాప్ కోసం వాడుకుని అందరికీ అవగాహన కల్పిస్తున్నారు కేరళ పోలీసులు. సాధారణంగా ఎంతో మంది కుర్రాళ్లు ఈ వీడియోవాడుకుంటూ ఉంటారు  ఇప్పుడు పోలీసులు కూడా వాడేసుకున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: