తెలుగు సినిమా పరిధి పెరిగిపోతున్న పరిస్థితులలో టాప్ హీరోల సినిమాలను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీలుగా నిర్మిస్తున్నారు.  దీనితో తెలుగు సినిమా కథ పరిధి పెరుగుతూ సరిహద్దులు దాటేసి జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షి స్తున్నాయి. దీనితో తెలుగు సినిమా చకచకా తన రూపురేఖలను మార్చుకుంటోంది. కథా కథనాల పరంగా సాంకేతిక పరంగా తెలుగుసినిమా కొత్త ఆలోచనలను సృష్టిస్తూ దేశవ్యాప్తంగా మన సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


ప్రస్తుతం తెలుగు సినిమాలు కేవలం తెలుగులోనే కాకుండా వీలైనన్నిఎక్కువ ప్రాంతీయ భాషలో విడుదలవుతున్న పరిస్థితులలో ప్రస్తుతం చాలామంది తెలుగు సినిమా సెలెబ్రెటీలు జాతీయస్థాయి సెలిబ్రెటీలుగా మారుతున్నారు. దీనితో తెలుగు సినిమాకు జాతీయస్థాయి గుర్తింపు రావాలి అంటే పర భాషా ప్రేక్షకులు కూడ మన తెలుగు  మూవీని తమ భాషా చిత్రాలుగా ఆదరిస్తున్నారు. మన తెలుగు సినిమా పర భాషా మూవీ అనే ఫీలింగ్ కలిగే విధంగా పర భాషలలో క్రేజ్ ఉన్న తమ ఆర్టిస్ట్ లను మన సినిమాలలో నటింప చేస్తున్నారు.


ఈ నేపధ్యంలో ఒకప్పుడు హీరోయిన్స్ టెక్నీషియన్స్ ను మాత్రమే ఇతర భాషల్లో నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆతరువాత విలన్ ల దిగుమతి కూడ ప్రారంభం అయింది. ఈవిషయమై అనేక విమర్శలు కూడ వచ్చాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ మారి ఇప్పుడు తెలుగులో భారీ సినిమాలకు తెలుగు దర్శకులను పక్కకు పెట్టి ఈభారీ ప్రాజెక్టులకు పరభాషా దర్శకులను ఎంపికచేయడంతో చాలామంది తెలుగు దర్శకుల అవకాశాలను దెబ్బతీస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరంజీవి ఆతరువాత ‘లూసిఫర్’ మళయాళ మూవీ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా కోసం తెలుగు దర్శకులను పక్కకు పెట్టి తమిళ దర్శకుడు మోహన్ రాజాను తీసుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. చరణ్ తన తదుపరి సినిమాను తెలుగు దర్శకులతో కాకుండా తమిళ దర్శకుడు శంకర్ తో ఒక భారీ సినిమాచేయాడానికి అంగీకరించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ప్రభాస్ విషయానికొస్తే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. రామ్ కూడ నెక్స్ట్ మూవీని  కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఉంటుందని ప్రకటన చేసాడు. మంచు విష్ణు ‘మోసగాళ్లు’ మూవీని ఒక తమిళ దర్శకుడుతో నిర్మించాడు. దీనితో పాన్ ఇండియా మూవీలు తీయగల శక్తి ఒక్క రాజమౌళికి తప్ప మరి ఏతెలుగు దర్శకుడికి లేదా అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: