ఇక విజయ్ ప్రస్తుతం తన 46వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు పోన్రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సమ్ పిక్చర్స్ ప్రొడక్షన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ రియాల్టీ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలను ఓ రోడ్డుపై చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. భారీగా వస్తున్న అతని అభిమానులును అక్కడి సెక్యూరిటీ కంట్రోల్ చేయలేక పోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
అయితే అభిమానులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్ తన కారు వద్దకు వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది. చివరికి షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితితో తన కారు వద్దకు వెళ్ళలేని విజయ్ సేతుపతి చిత్రయూనిట్ సభ్యుల్లో ఒక వ్యక్తి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చిత్రయూనిట్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయలేదని అక్కడి ప్రభుత్వాధికారులు జరిమానా విధించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి