ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అలానే టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, నేడు ఈ సినిమా నుండి ఏవో ఏవో కలలే అనే సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. అలానే కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన సారంగదరియా సాంగ్ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో మరింత అంచనాలు పెంచింది అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే లేటెస్ట్ లో కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హృద్యమైన ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన హైలెట్ గా నిలవనున్నాయట.
ఆ సీన్స్ లో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కూడా అదరగొట్టే పర్ఫామెన్స్ చేశారని తప్పకుండా రిలీజ్ తర్వాత మూవీ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆ సన్నివేశాలు ఆడియన్స్ కి ఎంతో కనెక్ట్ అవుతాయి అంటున్నారు. తొలిసారిగా సాయి పల్లవి తో నాగచైతన్య నటిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ లో కూడా ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా అందరిలోనూ మంచి సూపర్ బజ్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎంతవరకు అంచనాలను అందుకంటుందో తెలియాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయాలి.....!!