ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం చిరంజీవి తమ్ముడు గానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు.  కేవలం సినిమాల్లో మాత్రమే కాదు బుల్లితెరపై కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తన నవ్వుతో నవ్వుల రారాజు గా మారిపోయారు.


 అయితే బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నాగబాబు అటు వెండి తెరపై కూడా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అదే సమయంలో సోషల్ వీడియోలో మెగా బ్రదర్ నాగబాబు కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఎన్నో విషయాలపై నాగబాబు మాట్లాడాడు.అంతే కాకుండా ఎంతో మంది పై విమర్శలు చేయడం కూడా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ.. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. 



 ఇటీ వలే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో ఓ అభిమాని మెగా బ్రదర్ నాగబాబును ఒక ఆసక్తికర ప్రశ్న అడగగా.. ఇక అంతకు మించి అవాక్కయ్యే   సమాధానం చెబుతాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇంస్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో పాల్గొన్న సమయంలో ఓ అభిమాని సార్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అంటూ నాగబాబును అడుగుతాడు.. అయితే ఈ వయసులో నాకు పెళ్ళా.. ఒకవేళ మీరంతా ఓకే అంటే నాకు కూడా మరో పెళ్లి చేసుకోవడం ఓకే.. అంటూ నాగబాబు షాకింగ్ సమాధానమిస్తాడు. ఇక నాగబాబు సమాధానంతో  అందరూ అవాక్కవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: