సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది, ఎన్నో ఆశలతో అడుగు పెడుతూ ఉంటారు. అందులో కొంతమందికి అదృష్టం వరిస్తే, మరికొంతమందికి దురదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా కొంతమంది వారి నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించినా, అదృష్టం వరించక, వారికి సరైన గుర్తింపు లభించలేదు. కానీ మరి కొంతమందేమో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి పోతూ ఉంటారు. అలాంటివారిలో రష్మిక మందన కూడా.
కేవలం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ అలాగే హిందీలో కూడా రెస్ట్ లేకుండా బిజీగా ఉంటోంది. అయితే ఇటీవల తమిళంలో కార్తీ సరసన నటించిన సుల్తాన్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రష్మిక ను చూసిన ప్రతి ఒక్కరు చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారట..
చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఎన్నో సినిమాలు చేశారు. కానీ రష్మిక లాగ అవకాశాలు తెచ్చుకోలేదు. అంతేకాకుండా ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా దాదాపుగా పర్వాలేదనిపించాయి. ఇక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం లో నటించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి, బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఇక దీంతో రష్మికా కు తిరుగులేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది రష్మిక.
ఇదిలా ఉండగా తెలుగులో సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన, నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే అటు తమిళంలో కూడా స్టార్ హీరో విజయ్ పక్కన సినిమా చేస్తోంది. అంతకుముందు కన్నడలో కూడా బిగ్ హీరోలతో జతకట్టింది. ఈ సుందరికి ఇకపై బాలీవుడ్ లో కూడా మరో మూడు సినిమాలతో బిజీగా మారనుందట. ఇక ఈమె నటించే అన్ని సినిమాలు దాదాపుగా హిట్ కొడతాయనే నమ్మకంvఏర్పడింది సినీ ఇండస్ట్రీలో. ఇక అలాగే అన్ని సినిమాలు కూడా ఈమెకు బాగా కలిసొస్తే, టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి