కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ కి కన్నడలో ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎలాగో అలాగే తమిళ్ లో అజిత్, విజయ్ ఎలాగో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ కి అంత క్రేజ్ వుంది. ముఖ్యంగా ఆయన డాన్స్ కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ వుంది. చాలా గ్రేస్ డాన్సర్ అని పునీత్ కి మంచి పేరుంది. ఐతే కన్నడలో అంత క్రేజ్ వున్నా కాని మిగతా స్టేట్ లో పునీత్ కి అసలు మార్కెట్ లేదు. ఇక తెలుగులో యష్ లాగే తన మార్కెట్ ని ఏర్పారచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పునీత్ రాజ్ కుమార్. ఇక ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'యువరత్న'.కన్నడంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుదల చేయడం జరిగింది. 'అఖిల్' ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయికుమార్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. హీరో పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా 'కె.జి.ఎఫ్' నిర్మాతలైన 'హోంబెల్ ఫిలిమ్స్' వారి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడంతో కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి.


ఇక పునీత్ రాజ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్లను గమనిస్తే...'యువరత్న' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కె.జి.ఎఫ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేశారు.వాళ్ళే ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 0.55కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 0.14కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. వీక్ డేస్ లో కూడా ఇదే జోరుని కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉంది.గట్టి పోటీలో కూడా ఈ రేంజ్లో కలెక్ట్ చెయ్యడం గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇలాగే పునీత్ చిన్నగా మార్కెట్ క్రియేట్ చేసుకుంటే యష్ లాగా మంచి పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: