సాధారణంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు.  కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికి ఆ తర్వాత మాత్రం ఎందుకో అవకాశాలు అందుకోలేక చిత్ర పరిశ్రమకు దూరం అవుతూ ఉంటారు కానీ ప్రేక్షకుల గుండెల్లో మాత్రం అలాగే ఉండిపోతే ఉంటారు అలాంటి హీరోయిన్లలో ఒకరు నేహా ఒబెరాయ్.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


 అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో అమాయకపు నటనతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత బాలు సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకి దూరమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో.. దస్ కహానియా,ఈ ఎం ఐ,వుడ్ స్టాక్ విల్లా, ఆస్మాన్ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాల్లో అంతగా మెప్పించకపోయిన నేహా ఒబెరాయ్ నటనకు మంచి ప్రశంసలు అందాయి. ఇక చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో చివరికి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.



 2010లో డైమండ్ వ్యాపారి విశాల్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో మెంబర్ గా కొనసాగుతుంది.  మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఈ అమ్మడు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వయస్సు పెరిగినప్పటికీ ఈ అమ్మడి అందం మాత్రం ఇంకా చెక్కుచెదర లేదు అని చెప్పాలి. అంతే నాజూకుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఒకప్పుడు బాలు సినిమాలో ఎంత నాజుగ్గా ఉందో ఇక ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత కూడా అంతే నాజూకుగా కనిపిస్తుంది అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అభిమానులు ఈ అమ్మడి రీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: