ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్నారంటూ ఇటీవల ప్రకటన ఇటీవల రావడం జరిగింది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై పల్లెటూరి నేపథ్యంలో మంచి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రెండు రోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని దాని స్థానంలో సుకుమార్, రామ్ చరణ్ తో సినిమా చేయనున్నన్నారనే వార్త ప్రచారం అయింది. కాగా కొద్ది సేపటి క్రితం వీటన్నిటినీ ఖండిస్తూ ఫాల్కన్ క్రియేషన్స్ వారు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉందని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఎంతో భారీస్థాయిలో రూపొందనుందని వారి ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలు ఏమాత్రం నమ్మవద్దు అందరి అంచనాలను అందుకునేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని నిర్మాతలు అంటున్నారు. మరి తొలిసారిగా విజయ్ దేవరకొండ, సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి