రైతు బతుకు జట్కా బండి కార్యక్రమం పై ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన వీడియోలలో కూడా ఎన్నో రకాల వీడియోలు స్పూఫ్ గా మారిపోయి అటు నెటిజన్ల అందర్నీ కూడా ఎంతగానో ఆకర్షించాయి. ఇక ఇటీవలే దీనిపై వీడియో రాలేదు కానీ... బతుకు జట్కా బండి కార్యక్రమం పేరు మార్చి ఒక అదిరిపోయే స్కిట్ గా మార్చేసారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ గ్రౌండ్ లో భాగంగా ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం కూడా నలుగురు గెస్టులు ఎంట్రీ ఇచ్చి ఇక తమదైన శైలిలో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారూ. ఈ క్రమంలోనే ఇటీవల క్యాష్ ప్రోగ్రాం మొత్తం పూర్తిగా సింగర్స్ తో నిండిపోయింది అని చెప్పాలి. ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా బతుకు జట్కా బండి కార్యక్రమం స్పూఫ్ చేస్తూ సుత్తి జట్కా బండి అంటు ఒక పేరు పెడుతుంది యాంకర్ సుమ ఈ క్రమంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి